పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు : 26,502
అసిస్టెంట్ లోకోపైలెట్లు: 17,673
టెక్నీషియన్లు: 8,829
రైల్వే జోన్లు: 21
సికింద్రాబాద్ రీజియన్‌లో ఖాళీగా ఉన్న పోస్టులు: 3,262(అసిస్టెంట్ లోకోపైలెట్లు: 2719, టెక్నీషిన్లు: 543) వీటితో పాటే ఎక్స్‌సర్వీసు మెన్ కోటా, వికలాంగులకు సంబంధించి పోస్టులు ఉన్నాయి. భువనేశ్వర్ రీజియన్‌లో ఖాళీ పోస్టులు: 702 (అసిస్టెంట్ లోకోపైలెట్లు: 455, టెక్నీషిన్లు 247) చెన్నై రీజియన్‌లో: 945.
అర్హతలు:
అసిస్టెంట్ లోకోపైలెట్ల పోస్టులకు పదోతరగతి పూర్తిచేశాక ఐటీఐ, డిప్లొమో, ఇంజినీరింగ్‌లో సంబంధించి ట్రేడ్లలో కోర్సులు పూర్తిచేసి ఉండాలి. టెక్నీషియన్ల విభాగంలో కొన్ని పోస్టులకు ఎస్‌ఎస్‌సీతో పాటు సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ, మరికొన్ని పోస్టులకు పదోతరగతి తరువాత ఇంటర్‌లో గణిత, భౌతికశాస్త్రం సబ్జెక్టులు చదివి ఉండాలి. బీ అభ్యర్థులకు వయసు 1-7-2018 నాటికి 18 నుంచి 28 ఏళ్ల లోపు ఉండాలి. బీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, వికలాంగులకు పదేళ్లు, ఓబీసీ 13 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 15 ఏళ్లు వయసు సడలింపు ఉంటుంది. బీ పరీక్ష రుసుం రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీసుమెన్లు, వికలాంగులు, స్త్రీలు, మైనార్టీలు, ఈబీసీ కేటగిరీకి చెందిన వారు రూ.250 చెల్లించాలి. దరఖాస్తు సమయంలో అంతర్జాలంలో చెల్లింపులు చేయాలి.
* కంప్యూటర్ ఆధారిత పరీక్షను ఏప్రిల్, మే నెలలో నిర్వహిస్తారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి ఆప్టిట్యూడ్ పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో అర్హత సాధించిన వారికి ధ్రువపత్రాల పరిశీలన చేసి పోస్టులు కేటాయిస్తారు.
ఇలా ఉంటుంది
పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. మొదటి విడత పరీక్షలో 75 ప్రశ్నలు ఉంటాయి. గంట వ్యవధిలో ఉంటుంది. దీంట్లో గణితం, జనరల్ ఇంటిలిజెన్స్, రీజనింగ్, జనరల్ సైన్సు, జనరల్ అవేర్‌నెస్, వర్తమాన అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. రెండో విడత పరీక్షను రెండు పార్టులుగా విభజిస్తారు. పార్టు‘ఎ’లో 100 ప్రశ్నలు ఉంటాయి. 90 నిమిషాల కాలవ్యవధిలో పరీక్ష రాయాలి. దీంట్లో గణితం, జనల్ ఇంటిలిజెన్సీ, రీజనింగ్, సైన్సు, ఇంజినీరింగ్ విభాగాలకు సంబంధించి, జనరల్ అవేర్‌నెస్, వర్తమాన అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.

‘పార్ట్ బి’లో: 75 ప్రశ్నలు ఉంటాయి. గంట వ్యవధిలో రాయాల్సి ఉంటుంది. ఈ విభాగంలో 35 శాతం మార్కులు సాధించాల్సి ఉంది. అభ్యర్థులు అర్హత సాధించిన ట్రేడుకు సంబంధించి ప్రశ్నలు ఉంటాయి.