▼
Monday, June 26, 2017
Sunday, June 25, 2017
సివిల్స్ యుద్ధం... నెట్లో సిద్ధం
సివిల్ సర్వీసెస్ ఫలితాలు వచ్చిన ప్రతిసారీ ‘ఓ ప్రయత్నం చేస్తే...’ అన్న ఆలోచన ప్రతి యువకుడికీ వస్తుంది. అయితే క్లిష్టమైన ఆ పరీక్షకు సిద్ధమవడంలో సరైన మార్గనిర్దేశంలేక చాలామంది ఆలోచన దశలోనే ఆగిపోతారు. ఈ లోటుని తీర్చడానికి ఇప్పుడు అనేక వెబ్సైట్లు వచ్చాయి. అవేంటో చూడండి!
ఇన్సైట్స్ఆన్ఇండియా
రోజూ పత్రికల్ని ఎంత క్షుణ్నంగా చదివిందీ పరీక్ష కోసం వర్తమాన అంశాల్ని ఎంత వరకూ ఆకళింపు చేసుకుంటున్నదీinsightsonindia.comనిర్వహించే క్విజ్ ద్వారా పరీక్షించుకోవచ్చు. ఈ క్విజ్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఇలా ప్రతి
దశలోనూ ఉపయోగపడుతుంది. వర్తమాన, విదేశీ వ్యవహారాలకు సంబంధించిన చర్చాకార్యక్రమాల ఆకాశవాణి(ఆడియో), రాజ్యసభ ఛానెల్ (వీడియో) క్లిప్పింగులను ఈ వెబ్సైట్లో చూడొచ్చు. సివిల్స్‌కు సిద్ధమయ్యేవారు చదవాల్సిన పుస్తకాల జాబితా ఇందులో దొరుకుతుంది. దీన్లో ప్రిలిమ్స్, మెయిన్స్‌కు సంబంధించిన టెస్ట్ సిరీస్‌లూ ఉంటాయి. కొంత మొత్తం చెల్లించి వాటిని రాయొచ్చు.
సివిల్ సర్వీసెస్ మొదటిసారి రాస్తున్న వారికి mrunal.orgఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. క్లిష్టమైన అంశాల్ని తన అనుభవంతో సులభంగా వివరించడంలో సంస్థ వ్యవస్థాపకుడు మృణాల్ పటేల్‌ది అందెవేసిన చేయి. సివిల్స్‌ను అందుకోలేకపోయినా తన పరీక్ష అనుభవాన్ని వృథాగా పోనీయకుండా సివిల్స్ ఔత్సాహికులకు శిక్షణ ఇస్తున్నాడు మృణాల్. వెబ్సైట్లో ప్రిలిమ్స్, మెయిన్స్ సన్నద్ధతకు అవసరమైన స్టడీ మెటీరియల్‌ను డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటూ ఉంది. వివిధ సబ్జెక్టులకు సంబంధించిన పాత ప్రశ్నాపత్రాలూ దీన్లో ఉంటాయి. ఔత్సాహికులు పరీక్ష ప్రిపరేషన్, ఆప్షనల్స్ ఎంపిక తదితర అంశాల్లో తమ సందేహాల్ని చెబితే వాటికి నిపుణులు సమాధానాలూ ఇస్తారు. యూట్యూబ్‌లో ‘మృణాల్ పటేల్’ ఛానెల్లో వీడియో పాఠాలూ ఉన్నాయి. ఆర్థికశాస్త్రం, భూగోళశాస్త్రాలకు సంబంధించి అత్యుత్తమ సమాచారం దొరుకుతుందిక్కడ.
అన్ అకాడమీ
21ఏళ్లకే ఐఏఎస్‌కు ఎంపికైన రోమన్ సైనీ unacademy.comసహ వ్యవస్థాపకుడు. ‘అన్అకాడమీ’ ద్వారా ప్రఖ్యాత పోటీ పరీక్షలకు, ముఖ్యంగా సివిల్స్ ఔత్సాహికులకు వీడియోల రూపంలో పాఠాల్ని అందించే లక్ష్యంతో కలెక్టర్ ఉద్యోగాన్ని సైతం వదులుకున్నాడు సైనీ. ఇందులో పాఠాలూ, స్టడీ మెటీరియల్ పూర్తిగా ఉచితం. వీరికి యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. దీన్లో వివిధ సబ్జెక్టులకు సంబంధించి విషయ నిపుణుల వీడియోలు ఉంటాయి. అలాగే సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమయ్యేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను దీన్లో చెబుతారు. వివిధ సబ్జెక్టులకు ఒకరికంటే ఎక్కువ మంది బోధకులు ఉన్నారు. దీన్లో ఇంకా ఐబీపీఎస్, ఎస్సెస్సీ లాంటి పరీక్షల సన్నద్ధతకు అవసరమయ్యే సమాచారం కూడా దొరుకుతుంది. ‘ది హిందూ’ సంపాదకీయాలపైన ఆడియో రూపంలో ప్రతిరోజూ సమీక్ష ఉంటుంది.
21ఏళ్లకే ఐఏఎస్‌కు ఎంపికైన రోమన్ సైనీ unacademy.comసహ వ్యవస్థాపకుడు. ‘అన్అకాడమీ’ ద్వారా ప్రఖ్యాత పోటీ పరీక్షలకు, ముఖ్యంగా సివిల్స్ ఔత్సాహికులకు వీడియోల రూపంలో పాఠాల్ని అందించే లక్ష్యంతో కలెక్టర్ ఉద్యోగాన్ని సైతం వదులుకున్నాడు సైనీ. ఇందులో పాఠాలూ, స్టడీ మెటీరియల్ పూర్తిగా ఉచితం. వీరికి యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. దీన్లో వివిధ సబ్జెక్టులకు సంబంధించి విషయ నిపుణుల వీడియోలు ఉంటాయి. అలాగే సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమయ్యేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను దీన్లో చెబుతారు. వివిధ సబ్జెక్టులకు ఒకరికంటే ఎక్కువ మంది బోధకులు ఉన్నారు. దీన్లో ఇంకా ఐబీపీఎస్, ఎస్సెస్సీ లాంటి పరీక్షల సన్నద్ధతకు అవసరమయ్యే సమాచారం కూడా దొరుకుతుంది. ‘ది హిందూ’ సంపాదకీయాలపైన ఆడియో రూపంలో ప్రతిరోజూ సమీక్ష ఉంటుంది.
రోజూ పత్రికల్ని ఎంత క్షుణ్నంగా చదివిందీ పరీక్ష కోసం వర్తమాన అంశాల్ని ఎంత వరకూ ఆకళింపు చేసుకుంటున్నదీinsightsonindia.comనిర్వహించే క్విజ్ ద్వారా పరీక్షించుకోవచ్చు. ఈ క్విజ్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఇలా ప్రతి
దశలోనూ ఉపయోగపడుతుంది. వర్తమాన, విదేశీ వ్యవహారాలకు సంబంధించిన చర్చాకార్యక్రమాల ఆకాశవాణి(ఆడియో), రాజ్యసభ ఛానెల్ (వీడియో) క్లిప్పింగులను ఈ వెబ్సైట్లో చూడొచ్చు. సివిల్స్‌కు సిద్ధమయ్యేవారు చదవాల్సిన పుస్తకాల జాబితా ఇందులో దొరుకుతుంది. దీన్లో ప్రిలిమ్స్, మెయిన్స్‌కు సంబంధించిన టెస్ట్ సిరీస్‌లూ ఉంటాయి. కొంత మొత్తం చెల్లించి వాటిని రాయొచ్చు.
ఐఏఎస్బాబా
iasbaba.com లో ప్రతిరోజూ కొత్త అంశాల్ని అప్లోడ్ చేస్తారు. ఏరోజుకారోజు వార్తల్లోని అంశాలను విశ్లేషణాత్మకంగా వివరిస్తారు. యోజన, కురుక్షేత్ర లాంటి మ్యాగజైన్లలో వచ్చే అంశాల్లోంచి సివిల్ సర్వీసెస్‌కు అవసరమైన సమాచారాన్ని ఎంపికచేసి వెబ్సైట్లో ఉంచుతారు. వీరి నెలవారీ ఆన్లైన్ మ్యాగజైన్లో మెయిన్స్ తరహా ప్రశ్నలు ఇస్తారు. అదే మ్యాగజైన్లో కొన్ని ముఖ్యమైన కథనాలు ఇస్తారు. ముందు ఇచ్చిన ప్రశ్నలకు ఈ కథనాల్లోని సమాచారంతో అద్భుతమైన నోట్సు తయారుచేసుకోవచ్చు. ప్రతి సబ్జెక్టుకూ సంబంధించి కోర్సుపైన అవగాహన పెంచే ‘మైండ్ మ్యాప్’లు ఉంటాయి. రోజువారీ క్విజ్ ఉంటుంది. మొదటిసారి సివిల్స్‌కు సిద్ధమవుతున్నవారికి ఈ ప్రశ్నలు సబ్జెక్టులోని ప్రాథమిక అంశాల్ని అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి.

జీకేటుడే
సివిల్స్ ఔత్సాహికులు రోజూ వర్తమాన అంశాల్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ విభాగంలో అత్యుత్తమ వెబ్సైట్gktoday.com. రోజువారీ, నెలవారీ వర్తమాన అంశాలు దీన్లో ఉంటాయి. రోజూ పది ప్రశ్నలతో క్విజ్ ఉంటుంది. దీనిద్వారా వర్తమాన అంశాలూ, ఆయా సంఘటనల నేపథ్యంపైన ప్రశ్నలు తెలుసుకోవచ్చు. వర్తమాన అంశాల్లో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ విభాగాలుంటాయి. వీటికితోడు పర్యావరణం, చట్టాలూ, క్రీడలూ... ఇలా విభాగాల వారీగానూ సమాచారం ఉంటుంది. కొంత మొత్తం చెల్లించి ఈ-బుక్స్ కొనుక్కోవచ్చు. వివిధ సబ్జెక్టులకు సంబంధించి ఆన్లైన్ కోర్సులనీ అందిస్తున్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ మాదిరి ప్రశ్నలూ ఉంటాయి.

బైజూస్
సివిల్స్‌కు సిద్ధమయ్యేవారు మొట్టమొదట చేయాల్సిన పని ఆరు నుంచి పదో తరగతి వరకూ ఎన్.సి.ఇ.ఆర్.టి. పుస్తకాల్ని చదవడం. byjus.comవెబ్సైట్లో 6-10 వరకూ సైన్స్, సోషల్ స్టడీస్, గణితం సబ్జెక్టులకు సంబంధించిన పాఠాలు పీడీఎఫ్ రూపంలో ఉంటాయి. కావాలంటే వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు కూడా. అన్ని ప్రధాన సబ్జెక్టులకూ సంబంధించిన వీడియో పాఠాల్ని ఈ వెబ్సైట్లో చూడొచ్చు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకాలు మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్, జన్ ధన్ యోజన తదితరాలకు సంబంధించిన సమాచారాన్ని వీడియోల రూపంలో అందిస్తున్నారు. బైజూస్ ఆప్ కూడా ఉంది.

ఇవి కూడా...
సివిల్స్ ఔత్సాహికులకు ఉపయోగపడే మరికొన్ని ముఖ్య వెబ్సైట్లు.

clearias.com, iasscore.in, cleariasexam.com, upsctyari.com, visionias.in, prsindia.com, generalawareness4bankexams.blogspot.in,
current-gk-today.blogspot.in
current-gk-today.blogspot.in